విద్యార్థులకు క్రీడలు ఒత్తిడిని తగ్గిస్తాయి
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి




సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 24:
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ప్రోత్సాహాన్ని అందిస్తాయని,క్రీడలతో మానసిక ఒత్తిడిలు తగ్గిస్తాయని ఆర్డీఓ సి.విశ్వనాథ్ పేర్కొన్నారు.
నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లోని శ్రీ సంకల్ప్ పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం – బ్లేజింగ్ రాకెట్స్-2026కు సంబంధించిన రెండవ రోజు సోమవారం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఆర్.డి.ఓ శ సి విశ్వనాథ్ , సంకల్ప్ పాఠశాలల అధినేత సుధాకర్ సర్ , సతీమణి రమ్యా రెడ్డి ,పాఠశాల ప్రిన్సిపల్ పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్య అతిధి గౌరవ సత్కారం తదనంతరం వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరిగింది.
విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మధ్య వివిధ వినోద క్రీడలను నిర్వహించారు. విద్యార్థులకు వారి గణ విభాగాల మధ్య వివిధ క్రీడా పోటీలు కబడ్డీ, కోకో, క్రికెట్, వాలీబాల్, షాట్ పూట్, త్రోబాల్, పరుగుపందెం, టగ్ ఆఫ్ వార్ తో పాటు వివిధ రకాల వినోద క్రీడలలో విద్యార్థులు అత్యుత్సాహంగా పాల్గొని, పోటాపోటీగా ఆడి తమదైన సత్తాను ప్రదర్శించారు. క్రీడా ప్రాంగణం ఆనంద కేరింతలతో, కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.
ముఖ్య అతిథులు తమ సందేశంలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలలో ప్రోత్సాహానివ్వడం ఆనందంగా ఉందని, క్ర్రీడలు విద్యార్థులలో శారీర దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను, వివిధ నైపుణ్యాలను, ఒత్తిడిని, ఆందోళనలను క్రీడలు తగ్గిస్తాయని మంచి నిద్రకు ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ఈ పాఠశాల క్రీడా మైదానం అద్భుతంగా అనేక సౌకార్యాలతో విశాలంగా ఉందని కొనియాడారు.
పోటీలలో పాల్గొని విజయం సాధించిన ప్రతి జట్టుకు, ప్రతి ఒక్కరికి షీల్డ్స్, మేమెంటోస్, మెడల్స్ , ప్రశంసా పత్రాలతో సత్కారిస్తూ బహుమతి ప్రధానం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది.
ఈ క్రీడా వార్షిక దినోత్సవాన్ని రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి
పాఠశాల యాజమాన్యం వారు పేరుపేరున ధన్యవాదములు తెలియజేశారు. ఇంతటితో ఈ కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య ముగిసినది.
