మార్చి 2న చలో విజయవాడకు సిద్ధం కండి


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 24:
అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యల పైన స్పందించాలని పరిష్కారం చేయాలని పరిష్కారం చేసేంతవరకు పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అని ఏర్పడిన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24, 25 తేదీ లలో ప్రాజెక్టు ల లో నిరసనలు అనంతరం 26 27 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అప్పటికి స్పందించకుంటే మార్చి 2న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలంతా సిద్ధం కావాలని అదేవిధంగా రాబోయే కాలంలో కార్మికులందరికీ నష్టం కలిగించేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులను తీసుకువచ్చిందని వాటి ద్వారా కార్మికులకు కనీస వేతనాలు అందకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని ఇప్పుడు ఇస్తున్న వేతనాలే అరకురగా ఇస్తుంటే బ్రతకలేక చావలేక కనీస వేతనాలు అమలు కోసం కార్మికులంగా పోరాటం చేస్తుంటే వాటికంటే తక్కువగా ఇచ్చేందుకు కేవలము రోజువారీగా 178 రూపాయలు ఇవ్వాలని మాత్రమే లేబర్ కోడ్ లు ఉన్నాయని వీటి వలన పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమల యాజమానులకు ఉపయోగపడుతున్నాయని, కార్మికుల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం చావో రేవో తెల్చుకోవాల్సిన సమయం ముందుందని వాటికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి గారు అన్నారు.
* ముందుగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన రిలే నిరాహార దీక్షలు సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు తోట. మద్దులు ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కే మహమ్మద్ గౌస్,పి వెంకట లింగం, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి సునీత, జిల్లా నాయకురాలు డి నిర్మల వసంత,నాగరాణి,వసంత,లలితమ్మ వీరితోపాటు మరో 250 మంది అంగన్వాడి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
*అనంతరం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) అర్బన్ ప్రాజెక్ట్ కార్యదర్శి సునీత కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000/-లు ఇవ్వాలని,పెండింగ్లో ఉన్న 1810 మినీవర్కర్లకు క్వాలిఫికేషన్ రిలక్సేషన్ ఇచ్చి మెయిన్సెంటర్లుగా మార్చాలని,గ్రాట్యూటి అమలుకు గైడ్ లేన్స్ రూపొందించాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని,అంగన్వాడీలకు సంక్షేమ పధకాలు అర్బన్, రూరల్ తేదీ లేకుండా అందరికీ అమలు చేయాలని,హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చెయ్యాలని,పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని,మే నెల అంతా వేసవి సెలవుల జీఓ వెంటనే ఇవ్వాలని,లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటి పెంచాలి. మెనూచార్జీలు పెంచాలి. ఉచితంగా గ్యాస్ సరఫరా చెయ్యాలని,ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని,5 సంవవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవో ఇవ్వాలని, ప్రీస్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని, గత రెండు సంవత్సరాలుగా అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు తెలిపిన ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల స్పందించి పరిష్కారం చేయాలని అన్నారు .
