ఆవుపాలతో శ్రీ జగజ్జననీ అమ్మవారి కి అభిషేకాలు

తరలివచ్చిన వేలాది మంది భక్తులు

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 24:
నంద్యాల పట్టణంలో శ్రీ జగజ్జననీ అమ్మవారి కి భక్తులు ఆవు పాలతో అభిషేకాలు నిర్వహించారు.శ్రీ జగజ్జననీ అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా అయిదు రోజుల పాటు అభిషేకాలు,అలంకరణలు చేస్తారు.అమ్మవారికి మొదటి రోజు నీటితో అభిషేకాలు నిర్వహించారు.రెండవరోజు అమ్మవారికి ఆవు పాలతో అభిషేకాలు నిర్వహించారు.గత 17 ఏళ్ళుగా శ్రీ జగజ్జననీ దేవాలయంలో వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.అమ్మవారికి ఆవుపాలతో అభిషేకాలు చేయడానికి మహిళలు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు నిర్వహించారు.ఆంధ్రా,తెలంగాణ పాతాళ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.కోరిన కోర్కెలు తీరిన వారు కొందరు వందల లీటర్ల ఆవుపాలతో అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఉద్యోగాలు వచ్చాయని,పెళ్ళిళ్ళు జరిగాయని,ఆరోగ్యం కుదుటపడిందని అమ్మవారి పై విశ్వాసంతో తండోప తండాలుగా వచ్చి అభిషేకాలు నిర్వహించారు.దేవాలయం నిర్వాహకులు పుల్లయ్య ,నారాయణ,భక్తులు పాల్గొన్నారు.

Scroll to Top