ఉయ్యలవాడ నరసింహారెడ్డి ధైర్యం, సౌర్యం ,ఆత్మాభిమానం తిరుగుబాటు ఆదర్శం  –  సన్నల సాయిరాం రెడ్డి                    

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 24:
రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 179వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.  జీవితంలో కొందరు రాజీపడతారు మరికొందరు రాజీలేని పోరాటం చేస్తారు రెండో కొవ్వకు చెందినవారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాజీ లేని పోరాటం చేసిన వారే చరిత్ర సృష్టిస్తారు చరిత్రలో వారి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.
అత్యంత శక్తివంతమైన తెల్ల దొరల పాలనను ఎదిరించి మొదటి స్వాతంత్ర యుద్ధానికి పదేళ్ల ముందే తెలుగువారి ఆత్మ అభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని ధీరత్వాన్ని,వీరత్వాన్ని చాటి చెప్పి వీరమరణాన్ని పొందిన మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తమ కుటుంబానికి ఇవ్వవలసిన భరణాన్ని ఇవ్వకుండా అవహేళనగా మాట్లాడిన వారిపై అప్పటికే ప్రజలపై అనేక పన్నులు మరియు మహిళలపై అసభ్యకర ప్రవర్తన తో లోలోపల కృంగిపోయిన నరసింహారెడ్డి బ్రిటిష్ రాజ్యంపై తిరుగుబాటు చేసి భవిష్యత్తులో వచ్చినటువంటి భారత స్వాతంత్ర సమరయోధులకు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు  
ఇటువంటి మహానీయుడు జన్మించిన గడ్డపై మనం జన్మించడం ఎంతో అదృష్టం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ వర్ధంతి సభలో నేను పాల్గొనడం ఆయన గురించి వినడం మాట్లాడడం వారి వారసులను చూడడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.  
వీరుల జయంతులు మరియు వర్ధంతుల సభలు జరపడానికి కారణం వారు దేశం కోసం చేసినటువంటి నిస్వార్ధమైనటువంటి ప్రాణ త్యాగం వారి ధైర్యం భవిష్యత్ తరాలకు తెలపడం మరియు వారు చూపిన మార్గంలో నడవడం వారికి నిజమైన నివాళి.

Scroll to Top