వివాహా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 26:

నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో గురువారం

బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అన్నపురెడ్డి సురేంద్ర రెడ్డి కుమార్తె ప్రణతి, బాల లింగారెడ్డిల నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులకు ఆయన పుష్పగుచ్ఛం అందించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు మరియు స్థానిక నాయకులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 38 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు, గోవింద్ నాయుడు, మహేంద్ర రెడ్డి, నరేంద్ర రెడ్డి, పుసులూరు మాజీ సర్పంచ్ సతీష్, భీమవరం వెంకటేశ్వరరెడ్డి, తాటికొండ మహేష్, మరాఠీ సూరి, సురేంద్ర గౌడ్, మహమ్మద్ హుస్సేన్, హారన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top