నూతన వధూవరులను ఆశీర్వదించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్
• ఘనంగా దియ్యాల మనోజ్ కుమార్, సాయి శ్రావ్యల వివాహా నిశ్చితార్థ వేడుక

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 26:
పట్టణంలోని విశాల్ మార్ట్ పైన ఉన్న ఎస్.ఎల్.ఎన్.ఎస్. ఫంక్షన్ హాల్ నందు గురువారం నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దియ్యాల రంగ ప్రసాద్ కుమారుడు డాక్టర్ దియ్యాల మనోజ్ కుమార్, డాక్టర్ సాయి శ్రావ్యల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులను ఆయన పుష్పగుచ్చం అందించి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ వేడుకలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబుతో పాటు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వామి నాయక్, అనుపూర్ ఈశ్వర్,38 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు, బోయ రామకృష్ణ, గోవింద్ నాయుడు, తాటికొండ మహేష్, సురేంద్ర గౌడ్, హారన్ బేగ్ తదితరులు వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
