

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 26:
నగరంలోని జి.ఆర్.సి కన్వెన్షన్ హాల్లో గురువారం జరిగిన వివాహ వేడుక రాజకీయ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ కుమార్తె తేజస్విని, హితేష్ ల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి. ఫిరోజ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆత్మీయంగా పలకరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఫిరోజ్ తన శు భాకాంక్షలు తెలియజేశారు. పాల్గొన్న నేతలు: ఈ కార్యక్రమంలో 38 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు, గోవింద్ నాయుడు, మరాఠీ సూరి, తాటికొండ మహేష్, సురేంద్ర గౌడ్, మహమ్మద్ హుస్సేన్, హారన్ బేగ్ పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.
