పార్లమెంట్ లో ఎన్ డి ఏ పక్షం త్రి లైన్ విఫ్ జారీ

సోమవారం ఢిల్లీలోనే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త  / మార్చి 08:
భారత పార్లమెంట్ లో సోమవారం ఎన్ డి ఏ పక్షం త్రి లైన్ విఫ్ జారీ చేసింది. పార్లమెంట్ లో ముఖ్య మైన, ఓటింగ్, బిల్లుల ఆమోదం కోసం జరిగే పార్లమెంట్ సభ్యుల ఓటింగ్ చాలా ముఖ్యం కావడంతో ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షం ఎంపీలు 100 శాతం హాజరుకావాలని ఎన్ డి ఏ పక్షం త్రి లైన్ విఫ్ జారీ చేసింది.  దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంట్ సభ్యులు 100 శాతం సోమవారం లోక్ సభలో హాజరు కావాలని ఆదేశాల జారీ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సోమవారం డోన్ నియోజకవర్గం కొత్త బురుజుల గ్రామంలోని సీఎం సభకు కాకుండా పార్లమెంట్ కు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హాజరు అవుతున్నామని ఆదివారం చెప్పారు.

Scroll to Top