భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 09 :
ఉగాది సందర్భంగా నందవరం క్షేత్రంలో నిర్వహించనున్న జ్యోతి వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వైద్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.ఈ మేరకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం..ఈ ఏడాది మార్చి 19 నుంచి 25 వరకు జ్యోతి వేడుకలు జరగనున్నాయి. ముఖ్యంగా 21,22 తేదీల్లో కీలక కార్యక్రమాలు ఉండటంతో ఈ రెండు రోజులలో సుమారు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు భక్తులు నందవరం చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు..భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా ఈ వేడుకలను రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భక్తుల భద్రత,ఆరోగ్య పరిరక్షణకు కూడా అధికారులు చర్యలు ప్రారంభించారు..ఈ నేపథ్యంలో నందవరం ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సీనియర్ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డితో చర్చలు జరిపినట్లు తెలిసింది. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది..ఇటీవల మహానంది క్షేత్రంలో జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి,భక్తులకు వైద్య సేవలు అందించిన విషయం తెలిసిందే…అదే విధంగా నందవరం ఉగాది జ్యోతి వేడుకల్లో కూడా భక్తులకు వైద్య సహాయం అందించాలని కోరారు..దీనిపై స్పందించిన డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఎమర్జెన్సీ అంబులెన్స్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఖరీదైన మందులను కూడా ఉచితంగా అందించడానికి తాము సిద్ధమని తెలియజేసినట్లు సమాచారం..అదేవిధంగా నంద్యాల పట్టణంలోని నంద్యాల క్రిటికల్ కేర్,ఇండస్,సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆసుపత్రులకు చెందిన ఎమర్జెన్సీ వైద్యులు కూడా అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది..భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ అంబులెన్స్‌తో పాటు ప్రాథమిక చికిత్స కేంద్రం,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
