



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ (పీఎంవికాస్ ) పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువత కు కేంద్ర ప్రభుత్వ మైనారిటీ మంత్రిత్వ శాఖ అందిస్తున్న నైపుణ్య శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖమాత్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు.. శనివారం నాడు స్థానిక నేషనల్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని ఆయన లాంచనం గా ప్రారంభం చేసారు.. ఈ కార్యక్రమం నేషనల్ విద్యా సంస్థల అధినేత డా. యస్. ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షత న జరిగింది.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముస్లిం, క్రిస్టియన్ తదితర మైనారిటీ యువతకు వృత్తి నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యం తో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పీఎంవికాస్ పథకాన్ని ప్రారంభించ్చిందని, దాని శిక్షణా కేంద్రాన్ని తన మంత్రిత్వ శాఖ ద్వారా నంద్యాల లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.. ఈ శిక్షణ ను నంద్యాల ప్రాంత మైనారిటీ యువత చక్కగా వినియోగం చేసుకొని మంచి భవిష్యత్ పొందాలని అన్నారు..
డా. యస్. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఆరు నెలల వ్యవధి కల వేర్ హౌజ్ సూపర్వైజర్ మరియు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోర్సు లు అందుబాటులో ఉన్నాయని, ఒక్కొక్క కోర్సు లో 200 సీట్స్ ఉన్నాయని తెలిపారు.. ఈ కోర్సు లలో శిక్షణ తో పాటు నెలకు 2000 రూపాయలు స్టైఫెండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.. తమ కళాశాలను ఈ శిక్షణా కేంద్రం గా ఎన్నుకున్నందుకు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి ఆయన ధన్యవాదములు తెలిపారు..
తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన గత 18 నెలల కాలంలో పదుల సంఖ్య లో జాబ్ మేళా లు నిర్వహించి వేలాది ఉద్యోగాల కల్పన చేసినట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు , జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని సాబీహా పర్వీన్, టీడీపీ క్రిస్టియన్ సెల్ జోసెఫ్, నేషనల్ విద్యా సంస్థల సెక్రటరీ రఫీ అహ్మద్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
