
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
గత కొద్ది నెలలుగా నంద్యాల ప్రాంత వాస్తవ్యులు, నంద్యాల ముద్దు బిడ్డ,ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ నిర్వహిస్తున్న ఎన్నో సంక్షేమ, సామాజిక కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసినదే.. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు,ప్రతి పథకాలు, నిరంతరంగా కొనసాగుతూ నంద్యాల ప్రజలకు చేరువగా ఉండటం ప్రజలు వాటిని స్వాగతించడం హర్షించ తగ్గ విషయం అని తెలీయజేసేందుకు చాలా సంతోషిస్తూన్నాము. అందులో భాగంగా నేడు మరో అడుగు ముందుకు వేస్తు తన సామాజిక వర్గానికి చెందిన ఆర్యవైశ్యుడిగా తమ వారికి కూడా.తనవంతు సేవ చేయాలని సదుద్దేశంతో ఆర్యవైశ్యుల మహిళా లోకానికి చిరుకానుకగా వడ్డీ లేని రుణాలు 25 మంది కలిపి ఒక బ్యాచ్ గా వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయించుకోవడం జరిగినది. కావున పొదుపు, లేదా ఇతర ఎలాంటి గ్రూపుల సహకారం లేని ఆర్యవైశ్య సోదరీమణులు 25 మంది మహిళలుకు 5,00,000 లక్షల వడ్డీ లేని రుణాలను అందించనున్నారు.తమ అప్లికేషన్లు..ఆథార్ కార్డ్ , బ్యాంక్ ఫ్రెంట్ పేజ్ జిరాక్స్,ఓటరు కార్డు జిరాక్స్ రెండు ఫోటోలు,ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.
గమనిక : *ఈ పథకం కేవలం నంద్యాల నియోజకవర్గ మహిళలలకు మాత్రమే..
