



సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 28:
స్ధానిక నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో 28-02-2026 వ తేదీన అనగా శనివారం జాతీయ సైన్స్ దోనోత్సవంను ఘనంగా జరుపుకోవడము జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాఠశాలచైర్మన్ యం.జి.వి .రవీంద్రనాద్, కరస్పాండెంట్ మాధవి లత విచ్చేసి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్ స్మరణార్ధం జాతీయ సైన్స్ దినోత్సవమును జరుపుకోవడము జరిగినది. ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ప్రపంచ ప్రఖ్యాతి పొదింది విజ్ఞానం అనేది మన జీవితాన్ని సులభం చేస్తుంది. కావున విద్యార్ధులు శాస్త్రయ దృకృదాన్ని అభివృద్ధి చేసుకోవాలని చిన్నారులకు అర్ధమయ్యేలా తెలియజేశారు. పాఠశాల చిన్నారులు సైన్స్ కు సంబంధితమైన అనేక ప్రాజెక్ట్ లను తమ సృజనాత్మకతతో తయారుచేసి అందరికీ ఆకట్టుకొనేలా చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు మరియు చిన్నారులు పాల్గొనడము జరిగినది.
