నంద్యాల టైలర్ల సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తాం – ఎన్ ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 28:
నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ టైలర్స్ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎన్ ఎండి ఫిరోజ్  హాజరయ్యారు.
ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ నాయకులు సమర్పించిన వినతులను ఉద్దేశించి ఎన్ ఎండి ఫిరోజ్  మాట్లాడుతూ, నంద్యాలలో టైలర్ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గుర్తింపు పొందిన టైలర్లకు ఇళ్ల పట్టాలు అందేలా కృషి చేస్తామని, వారి నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్పొరేషన్ రుణాలు పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా టైలర్లకు సంబంధించిన ఇతర సమస్యలన్నింటినీ మంత్రివర్యులు ఎన్ ఎండి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లి తప్పక పరిష్కారం సాధించేలా కృషి చేస్తామని హామీనిచ్చారు.అదేవిధంగా ఇటీవల మరణించిన టైలర్ సతీమణికి మరియు వృద్ధ టైలర్ సోదరులకు అసోసియేషన్ తరఫున ఎన్ ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్, మార్క్ ఫెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ తులసి రెడ్డి, డా. రామకృష్ణ రెడ్డి, డా.రవికృష్ణ, టైలర్స్ సంఘం నాయకులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top