నంద్యాల మున్సిపాలిటీలో కొత్త ట్రాక్టర్ల ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 28:
నంద్యాల పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దే లక్ష్యంతో నంద్యాల మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. 15వ ఆర్థిక సంఘం (15th ఫైనాన్స్ కమిషన్ ) గ్రాంట్ నిధుల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ మరియు పట్టణ పచ్చదనం పెంపొందించడం కోసం కొనుగోలు చేసిన రెండు నూతన ట్రాక్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఈరోజు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, పారిశుద్ధ్య మెరుగుదలకు మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాలు పట్టణంలోని చెత్త సేకరణకు మరియు మొక్కల పెంపకానికి ఎంతో దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top