బేడ బుడగ జంగాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం –  మంత్రి ఎన్ఎండి ఫరూక్*

కుల ధృవీకరణ పత్రాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం

14వ వార్డులో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి హామీ

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 28:
బేడ బుడగ జంగాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. శనివారం నంద్యాల పట్టణంలోని 14వ వార్డు పర్యటనలో భాగంగా బేడ బుడగ జంగాల సామాజిక వర్గ ప్రతినిధులు మంత్రి ఫరూక్ ని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ కుల ధృవీకరణ పత్రాల (క్యాస్ట్ సర్టిఫికెట్స్) కోసం అధికారుల దగ్గరికి వెళ్తే, జాబితాలో పేరు లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా, 14వ వార్డులోని బేడ బుడగ జంగాల కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మించాలని మరియు స్థానిక రామాలయ అభివృద్ధికి సహకరించాలని మంత్రి ఫరూక్ ని వినతి పత్రంలో కోరారు 

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ బేడ బుడగ జంగాల ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఫరూక్ బేడ బుడగ జంగాల కుల ధృవీకరణ పత్రాల అంశాన్ని మరియు ఎస్టీ జాబితాలో చేర్చే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, స్థానిక సమస్యలైన డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని, రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల ప్రతినిధులు తాటికొండ బుగ్గ రాముడు, సుధాకర్, అంకాలు, మహేష్ మరియు టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు , జిల్లెల్ల శ్రీరాములు , నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్ , అడ్వకేట్ ఖలీల్, జైలాన్ , ఎంబిటీ బాబు , కామిని మల్లికార్జున , ఎబినేజర్ , నాగేశ్వరరావు , షేక్ మహమ్మద్ రఫీ (మున్నా), వేణు , సాయిరాం , వాకా వర ప్రసాద్, వేద సాయి , ఉప్పరి సురేష్ , మాజీ కౌన్సిలర్ కృపాకర్, పసుపులేటి నారాయణ మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్న , మున్సిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు , ప్రజలలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top