వీరమహిళల “జై జనసేన, జై పవన్ కళ్యాణ్” గర్జనతో మారుమోగిన వేదిక

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :
నంద్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
వీరమహిళల “జై జనసేన, జై పవన్ కళ్యాణ్ ”గర్జనతో మొదలైన వేడుకలు.జనసైనికులు ,నాయకులు వీరామహిళలు కేక్ కటింగ్ చేసుకొని, మిఠాయి పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు రాచమడుగు చందు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయలో మార్పు, సమాజశ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎర్పడిన పార్టీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉపిరిగా మర్చికొని సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ప్రతి జనసైనికుడికి, వీరమహిళలకు, నాయకులకు అభినందనలు తెలిపారు. నంద్యాల జిల్లా జనసేన పార్టీ బలోపేతానికి రాచమడుగు సోదరులు మరింత బలంగా కృషి చేస్తాం అనీ అలాగే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పలు సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేవనగర్ జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, సంజీవరాయుడు,శివశేఖర్,హరిజనవాడ నాయకులు ఠాగూర్,సుంకన్న,చిన్న,సర్దార్ రవి, ఫరూక్ సయ్యద్,ఫయాజ్,దుర్గ ప్రసాద్ వీరామహిళాలు తదితరులు పాల్గొన్నారు.
