

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి ఉత్సవాల ముగింపు సభను పురస్కరించుకుని, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి నాయకులు శనివారం రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 16, 2026 (సోమవారం) ఉదయం 11 గంటలకు జరుగు పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల ముగింపు సభ మరియు శాఖమూరి పార్కు, తుళ్లూరు పెద్దపరిమి రోడ్డు, అమరావతి దగ్గర 58 అడుగుల భారీ అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ.
ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు మంత్రి ఫరూక్ కి అధికారికంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి స్మారకార్థం ఏర్పాటు చేస్తున్న ఈ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త, గౌరవాధ్యక్షుడు కండె శ్యాంసుందర్ లాల్, మరియు పొట్టిశ్రీరాములు పరిరక్షణ సమితి అధ్యక్షుడు సేగు ఉపేంద్ర, టిడిపి నాయకులు నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్, అడ్వకేట్ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
