ప్రజలకోసం సమాజంలో మార్పు కోసం పుట్టిన పార్టీ “జనసేన”

సినిమాల్లో కాదు,నిజజీవితంలో  ప్రజలకోసం నిలబడిన నాయకుడు పవన్ కళ్యాణ్

విలువలతో కూడిన సేవచేసే రాజకీయ పార్టీ

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 14 :

ప్రజలకోసం,సమాజంలో మార్పుకోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ, కేవలం సినీ ప్రపంచంలో కాకుండా నిజజీవితంలో సైతం ప్రజల సేవ కోసం ఆర్తపడే నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని నంద్యాల జనసేన నాయకులు భవనాసి శ్రీనివాసులు ( వాసు ) పేర్కొన్నారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయం లో జనసేన నాయకులు భవనాసి వాసు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండాను ఆవిష్కరించి ,జన సైనికులు,వీర మహిళల సమక్షంలో భారీ కేకు కట్ చేశారు.అంతకు ముందు సి ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి,పరివర్తన లైఫ్ సెంటర్ లో విద్యార్థులకు అన్నదానం చేశారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశములో భవనాసి శ్రీనివాసులు ( వాసు ) మాట్లాడుతూ జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.ప్రజలకోసం,సమాజంలో మార్పు కోసం జనసేన పార్టీ ఉద్భవించిందన్నారు.ప్రజల సమస్యలు,రైతు సమస్యలు,యువత ఆశయాలు తో పాటు ప్రజల శ్రేయస్సుకోసం ప్రత్యామ్నాయ పార్టీ నీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.సినిమాలోనే కాకుండా నిజజీవితంలో సైతం ప్రజలకోసం నిలబడి ప్రజల నాయకుడిగా ఆదరణ పొందుతున్నారన్నారు.ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు పాటిస్తున్నామన్నారు.రాజకీయాలు పదవులకోసం కాదు సేవ కోసం అని నిరూపించారన్నారు.జనసేన పార్టీ పెట్టీ న 13 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడినా ,కార్యకర్తల కష్టాలను కళ్ళారా చూసి జనసేన పార్టీ నీ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు.పవన్ కళ్యాణ్ ఆలోచనలు,సిద్ధాంతాలు  ముందుకు తీసుకొని పోతామన్నారు.జనసేన ఉద్యమి కార్యక్రమం ఈ నెల 17 వరకు కొనసాగుతుందని,ఇంకా ఎవరైనా మెంబర్ షిప్ తీసుకొని వారికి మంచి అవకాశం అన్నారు. మారాసు గురు బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ సేవా భావాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడమే మా లక్ష్యం అన్నారు.జనసేన పార్టీ ఉద్యమీ ఫిబ్రవరి 16 న మొదలు పెట్టామని మార్చి 10 వరకు ఉండేదని అభిమానుల కోరిక మేరకు మార్చి 17 వరకు కొనసాగుతుందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.పిఠాపురం లో ఆయనకు వచ్చే జీతం సైతం పేద ప్రజలకు అందించిన మహనీయుడన్నారు.రోడ్లు,పల్లె బాట,అడవి తల్లి బాట తో ముందుకు సాగుతున్నారన్నారు.దండు మురళి మాట్లాడుతూ దేశంలో కనివిని ఎరుగని రీతిలో రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో నూటికి నూరు శాతం విజయం సాధించిన పార్టీ ఒక్క జనసేన పార్టీ అని గుర్తు చేశారు.ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ ముందుకు సాగిపోతున్నారని అన్నారు.జన సైనికులు సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ,మరో సారి చరిత్ర సృష్టిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.రాము మాట్లాడుతుకుల మతాలకు అతీతంగా,భాషలను గౌరవించడం,సంసృతి,సంప్రదాయాలు కాపాడడం,అవినీతి పై రాజీలేని పోరాటం,పర్యావరణ ,పరిరక్షణ,అభివృద్ధి,ప్రత్యతని విస్మరించి జాతీయ వాదం ,విలువలతో కూడిన రాజకీయం చేయడమే జన సేన పార్టీ లక్షం అన్నారు.ప్రజలు ఇచ్చిన బాధ్యతను విస్మరించకుండా అభివృద్యే ద్యేయంగా చేస్తున్నారని అన్నారు.రాజకీయాల్లో జవాబుదారీ తనంగా స్పందించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు.అనంతరం జనసైనికులకు,విరమహీళలకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు ,అభిమానులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top