నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 23:
నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది.  విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్లకుండా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఐపీఎస్ నంద్యాల పట్టణ కేంద్రంలోని పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను సిబ్బందిని ఆదేశించడం జరిగింది. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా ఉండేందుకు, పరీక్షలు ముగిసే వరకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం జరిగింది.

Scroll to Top