పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 88 ఫిర్యాదులు

విచారణ జరిపి ఫిర్యాదుదారులకు చట్ట పరిదిలో న్యాయం చేస్తాం

  -జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ ఐపీఎస్ 

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 23:
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ( 23-02-2026) నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్  ఫిర్యాదిదారుల నుంచి 88 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 ఫిర్యాదులలో కొన్ని…. 

1).నాకు నందమూరి నగర్ నందు ప్రభుత్వం వారు మూడు సెంట్ల స్థలం మరియు పట్టాను మంజూరు చేయడం జరిగింది. సదరు స్థలంలో మహబూబ్ బాషా అనే వ్యక్తి అక్రమించుకొని దౌర్జన్యంగా రేకులు వేయడం జరిగింది. నేను అడిగితే నాపై దౌర్జన్యం చేస్తున్నాడని నాకు న్యాయం చేయండని షేక్ .వహీదాభి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

2).గడిగరేవుల గ్రామానికి చెందిన పసుల.రాజు అనే వ్యక్తి నా వద్ద నుండి 9 పొట్టేలను తీసుకొని వెళ్లి డబ్బులు అడిగితే ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని నాకు న్యాయం చేయండని కొండజూటూరు గ్రామానికి చెందిన ఓబులేసు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

3).నాకు చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామ పొలిమేరలో పొలం కలదు. సదరు పొలంనకు 60 సంవత్సరాల నుండి వెళ్తున్న దారిలో వెళ్లకుండా అడ్డంకులు కలిగిస్తూ బెదిరిస్తున్నాడని మాకు న్యాయం చేయండని శెట్టివీడు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

4).నేను ఆళ్లగడ్డ పట్టణంలో ఉంటున్నాను మా ఇంటిని ఆక్రమించుకోవాలని దస్తగిరి నన్ను నా కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నాడని నాకు న్యాయం చేయండని నాగ పుల్లయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Scroll to Top