16వ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – నంద్యాలలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 12:
రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. మడమ తిప్పని పంతం.. అడుగు తప్పని గమ్యం: 16వ ఏట వైఎస్సార్‌సీపీ ప్రస్థానం!, ప్రజా గుండెల్లో వైఎస్సార్‌సీపీ.. 15 ఏళ్ల నమ్మకం.. మరో పోరాటానికి సిద్ధం!, వైఎస్సార్ ఆశయాలకు వారసుడు.. 15 ఏళ్ల వైఎస్ జగన్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం!, కష్టాల నుంచి కోట్లాది మంది ఆశల వరకు.. వైఎస్సార్‌సీపీ 15 ఏళ్ల విజయగాథ! ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన పార్టీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటితో 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 2011 మార్చి 12న ఇడుపులపాయ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాటిన ఈ మొక్క, నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటున్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా.. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జగన్, 2011లో వైఎస్సార్‌సీపీని స్థాపించారు. 15 ఏళ్ల ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జననేతగా ప్రజలకు చేరువయ్యారు. నాటి నుండి సాగిన జగన్ మోహన్ రెడ్డి పోరాటం అమోఘం, అనన్య సామాన్యం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర… పార్టీ చరిత్రలో ఒక కీలక మలుపు. నంద్యాలలో…మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో…ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష ఆద్వర్యంలో వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా ,ఎస్ ఈ సి మెంబర్ రామలింగారెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్,మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్టేట్ లీగల్ సెల్ అధికార ప్రతినిధి తిమ్మారెడ్డి,రాష్ట్ర మహిళ విభాగం సెక్రటరీ శశికళ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అమృత రాజ్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, జిల్లా సెక్రెటరీ లు దేవనగర్ బాషా, శివనాగిరెడ్డి, వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు కారు రవికుమార్, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు టి వి రమణ, మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు వార్డు ఇన్చార్జిలు వైసిపి నాయకులు, కార్యకర్తలు,హాజరయ్యారు.అభిమానులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయం ఆవరణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్, వైఎస్సార్ సర్కిల్, సాయిబాబనగర్ లోని డా.వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

 ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, స్టేట్ సీఈసీ మెంబర్ పిపి నాగిరెడ్డి,మాట్లాడుతూ… జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ప్రస్థానం.. ప్రజల సంక్షేమం కోసం కులమతాలకు, వర్గాలకు, ధనిక, పేద అనే బేధం లేకుండా ప్రజల సంక్షేమమే ఊపిరిగా నిరంతరంగా కృషి చేసి 15 ఏళ్ళు పూర్తి చేసుకొని నేడు 16వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సంధర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓదార్పు యాత్ర నుండి వేసిన అడుగులు ప్రజల సంక్షేమం దిశగా పోరాటాలు చేస్తూ నేటికి 15 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. కష్టాల నుండి కోట్లాది మంది ఆశయాల సాధనకు కృషిచేస్తున్న పార్టీగా ప్రత్యే గుర్తింపు ఉందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని, ప్రధానంగా పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నవరత్నాలాంటి పథకాలను అమలు చేసిందన్నారు. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక పార్టీగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, పేర్కొన్నారు. జననేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ తెరపై తనదైన ప్రత్యేక తను చాటుకున్నారన్నారు. మడమ తిప్పని పంతం అడుగు తప్పని గమ్యం వైపు పోరాటాలు చేస్తున్న 15 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్క వైసీపీ నేతలకు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు సరికొత్త ఉత్సాహంతో పార్టీని మరింత భలోపతం చేయాలని, రానున్న ఎన్నికల్లో మరోసారి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమమే ఊపిరిగా పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు. జననేత 15ఏళ్ల ప్రస్థానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు, ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top