జమిఅత్ ఉలమాయే హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

సత్యం వార్త / నంద్యాల  / మార్చి 12 :

నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ ఖుబ్రా మస్జిద్‌లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జమిఅత్ ఉలమాయే హింద్ నంద్యాల జిల్లా మరియు ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపవాస విరమణ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. రంజాన్ మాసం శాంతి, సహనం, సహకారం మరియు మానవతా విలువలను పెంపొందించే పవిత్ర కాలమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా నంద్యాల పట్టణం 2 టౌన్ సీఐ అస్రర్ బాషా, తాలూకా సీఐ ఐశ్వరయ్య, ఎస్ఐ గంగయ్య యాదవ్ మరియు ఎస్ఐ నజీర్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక ఐక్యత, మత సౌహార్దం మరింత బలపడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమిఅత్ ఉలమాయే హింద్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ బాషా, ఇమాములు, ముస్లిం పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.

Scroll to Top