వాహనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు – జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శివారెడ్డి

వాహనాల షోరూముల్లో ఆర్టీవో అధికారులు తనికీలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 12 :
నంద్యాల పట్టణంలోని వివిధ వాహనాలు విక్రయించే షో రూముల్లో వాహనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి శివారెడ్డి హెచ్చరించారు.జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వాహనాల షో రూముల్లో వాహనాలు అధిక ధరలకు విక్రయించకుండా తనికీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధం కారణంగా వాహనాలు అధిక ధరలకు విక్రయించకూడదని ముందస్తుగా అన్ని వాహనాల షో రూముల్లో అధికారులు తో తనికీలు నిర్వహించి రికార్డులు పరిశీలిస్తున్నామని అన్నారు.ప్రజలు ఒక విషయాన్ని గమనించాలని ఆర్టీవో అధికారులు ప్రజలతో స్నేహభావంతో ఉన్నారని,సమస్యలు ఎదురైతే నేరుగా కలిసి సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నారు.

Scroll to Top