విడాకులు లేకుండానే రెండో పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

విడాకులు లేకుండానే రెండో పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

విజయవాడకు చెందిన యువతితో వివాహం

రూ.60 లక్షల నగదు,40 తూలాల బంగారం కట్నం ఇచ్చినట్లు ఆరోపణ

ఆడపిల్ల పుట్టిందని ఏడు నెలల బాలింతపై వేధింపులు

కర్రలు,ఇనుప రాడ్లతో దాడి – తీవ్ర గాయాలు

నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

పోలీసులను అత్తారింటి వారు మ్యానేజ్ చేశారని బాధితురాలి ఆరోపణ

విజయవాడలో కేసు వేస్తామని బాధితురాలి ప్రకటన

స్థానిక ఎస్సై కేసు తీసుకోలేదని ఆరోపణలు

విషయం జిల్లా ఎస్పీ దృష్టికి..సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 12:
మొదటి భార్యతో చట్టపరంగా విడాకులు రాకుండానే విడాకులు వచ్చాయని నమ్మించి రెండో వివాహం చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యవహారం నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అదనపు కట్నం కోసం అత్తారింటి వారు ఏడు నెలల బాలింతపై దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది..!!*
బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విజయవాడకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.పెళ్లి సమయంలో అత్తారింటి వారి డిమాండ్ మేరకు రూ.60 లక్షల నగదు,40 తులాల బంగారం కట్నంగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపారు..!!*
బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ..“పెళ్లి సమయంలో మా కుటుంబం రూ.60 లక్షల నగదు,40 తూలాల బంగారం ఇచ్చింది.అయినప్పటికీ అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తమామలు తరచూ వేధించేవారు.ఇటీవల నాకు ఆడపిల్ల పుట్టింది. అదే కారణంగా నాపై మరింత వేధింపులు పెంచారు” అని ఆవేదన వ్యక్తం చేసింది..!!*
“ఇటీవల కట్నం కోసం గొడవ పెట్టుకుని కర్రలు,ఇనుప రాడ్లతో నాపై దాడి చేశారు. దాడిలో నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాను” అని తెలిపింది..!!*
ఇదే సమయంలో తన భర్తకు మొదటి భార్యతో ఇంకా చట్టపరంగా విడాకులు రాలేదని,అయినప్పటికీ విడాకులు వచ్చాయని నమ్మించి రెండో వివాహం చేసుకున్నట్లు ఆమె ఆరోపించింది.ఈ విషయం తరువాత తెలిసి తాను మోసపోయానని పేర్కొంది..!!*
అలాగే అత్తారింటి వారు ఇక్కడి పోలీసులను ప్రభావితం చేసి కేసు నమోదు కాకుండా చేస్తున్నారని కూడా బాధితురాలు ఆరోపించింది.“ఇక్కడి పోలీసులను అత్తారింటి వారు మ్యానేజ్ చేశారు. ఇక్కడ ఉంటే మమ్మల్ని చంపేస్తారు.మాకు ఇక్కడ ఎవరూ దిక్కు లేరు.అందుకే నేను మా సొంత ఊరు విజయవాడకు వెళ్లి అక్కడే కేసు వేస్తాను” అని ఆమె కన్నీటి పర్యంతమై మీడియాకు తెలిపారు..!!*
ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక ఎస్సై కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆరోపిస్తోంది.దీంతో విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం.ఘటనపై జిల్లా ఎస్పీ సీరియస్‌గా స్పందించినట్లు,పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది..!!*
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Scroll to Top