విజయవాడలో ఘనంగా రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇఫ్తార్ విందు – ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎన్ఎండి ఫరూక్

మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి ఎన్ఎండి ఫరూక్ 

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 12:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ & వైస్ ఛైర్మన్ యాకుబ్ బాషా ఆధ్వర్యంలో విజయవాడ లబ్బిపేట కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్రన్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు, మైనారిటీ నాయకులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొని ఉపవాస విరమణ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మైనారిటీల విశ్వాసాన్ని పొందుతున్నామని అన్నారు.దేశంలో ఎన్నడూ లేనివిధంగా మైనారిటీ సంక్షేమం కోసం 6,090 కోట్ల నిధులు కేటాయించి, మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు.*
అదేవిధంగా రాబోయే రోజుల్లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ఉచిత శిక్షణ అందించడంతో పాటు, నైపుణ్యం కలిగిన వారికి సబ్సిడీ రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి 50 లక్షల రూపాయలను కేటాయించి, ప్రతి జిల్లా కేంద్రంలో ఘనంగా ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.*
ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫరూక్ శుబ్లీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ముస్తాక్ మౌలాన, కార్పొరేషన్ సభ్యులు మనియార్ ఖలీల్ అహ్మద్,అబ్దుల్ సలీమా,అప్సిరి సయ్యద్,హసీమ్ బేగ్, భక్తియర్,మస్తాన్ బీ, ఇబ్రహీం, ముంతాజ్, రహీం బాబు, సల్మా శరీన్, సబీరా మహ్మద్, షాంసుద్దీన్, జాకీర్, సయ్యద్ బాషా, సాదిక్ మరియు కార్పొరేషన్ అధికారులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.*

Scroll to Top