

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 07 :
“శిల్పా మహిళా సహకార్ ” ఇది ఒక మహిళా పక్షపాతి ఆలోచన, మానవతా వాది మానస పుత్రిక, అయన ఎవరో కాదు ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి అత్యున్నత స్థానానికి ఎదిగిన ఒక రాజకీయ కెరటం మాజీ మంత్రి వర్యులు శిల్పా మోహన్ రెడ్డి, అయన మనసులో మహిళలను ఎదో ఒక విధంగా ఆర్థిక స్వా వలంబన దిశగా తీసుకుని వెళ్లాలనే ఆలోచనే ఈ శిల్పా మహిళా సహకార్ స్థాపనకు ప్రధాన కారణం. 2010 లో ఈ సుంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి కేవలం మహిళలకు మాత్రమే అతి తక్కువ వడ్డీకి అనగా ప్రారంభం లో పావలా వడ్డీతో 5000 నుండి రుణాలు ఇవ్వడం జరిగింది, కాల క్రమేణా వడ్డీ తక్కువ ఉండటం వలన సంఘం నష్టాల లో ఉండటం వలన కొంత వడ్డీ పెంచాలని సహకార శాఖ సూచించడం తో 8% వడ్డీ తో ప్రస్తుతం 25 వేల వరకు కేవలం ఒకరికి ఒకరు పూచీ అనే విధానం తో సులభ వాయిదా ల పద్ధతి లో ఋణాలు అందిస్తున్న ఏకైక సహకార సంఘం .ఈ సంఘం 9 మంది మహిళా పాలక మండలి సభ్యులతో, 16 మంది మహిళా సిబ్బంది తో విజయ వంతంగా సేవలందిస్తోంది. మహిళల ఇంటివద్ద నే ఆర్థిక సేవలందించడం వలన ఇక్కడ ఋణాలు తీసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతున్నారు 10 వేల మందికి పైగా సభ్యత్వం ఉన్నటువంటి ఈ సంఘం రుణాలతో పాటు రికరింగ్ డిపాజిట్ లను ప్రోత్సహిస్తూ మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తుంది. అంతే కాక నంద్యాల మరియు పరిసర ప్రాంత మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తో పాటు మగ్గం వర్క్, బుట్టల అల్లకం, శుభకార్యాలకు మెహందీ పెట్టడం లాంటి కార్యక్రమాలు చేపట్టి ఎందరో మహిళలు స్వయంగా సంపాదించుకుని వారి ఉనికిని చాటే విధంగా కృషి చేస్తున్నారు సంస్థ చైర్ పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి నెల తప్పకుండా ఎంత మంది దరఖాస్తు చేసుకుంటే అంత మంది మహిళలకు ఋణాలు అందిస్తూ వారి పిల్లల చదువులకు, వ్యాపారాలకు, గృహ అవసరాలకు ఒక్కటేమిటి చెప్తూ పోతే ప్రతి దాంట్లో పేరు వినిపించే శిల్పా మహిళా సహకార్ సేవలో మొదటి స్థానం సంపాదించుకుంది అని గర్వంగా చెప్పవచ్చు. అలాగే మహిళల మనస్సులో మొదటి స్థానం కలిగి వుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సంఘం కార్యకలాపాలు అన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నటువంటి నాగిని రెడ్డి కి నంద్యాల మహిళల తరపున “ప్రపంచ మహిళా దినోత్సవ” శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
