
సత్యం వార్త / నంద్యాల / మార్చి 23 :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8, 2026) సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ అసిస్టెంట్ పోలీస్ అధికారి మంద జావలి ఆల్ఫన్స్ (ఐపీఎస్) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందజేసి, వారి ప్రతిభను అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజానికి మార్గదర్శకులవుతున్నారని తెలిపారు. మహిళల సాధికారతకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మార్కెట్ ప్రసాద్ సతీమణి ఎల్. ఆది లక్ష్మమ్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.
