న్యాయస్థాన సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల రిపోర్టర్ /జనవరి 6 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయస్థానాల్లో పనిచేస్తున్న క్లర్కులు మరియు అటెండర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సానుకూలంగా కృషి చేస్తానని రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు. మంగళవారం నాడు నంద్యాలలో మంత్రి ఫరూక్ ని కలిసిన కోర్టు సిబ్బంది తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాము 2001 నుండి సెకండ్ క్లాస్ కోర్టులలో అతి తక్కువ వేతనాలతో విధులను నిర్వహిస్తున్నామని ప్రస్తుత కాలంలో పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా, పాత వేతనాలతో కుటుంబాలను పోషించడం భారంగా మారిందని, తమ వేతనాలను పెంచి ఆదుకోవాలని మంత్రి ఫరూక్ ని కోరారు. సిబ్బంది విన్నపాన్ని సానుకూలంగా విన్న మంత్రి ఫరూక్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని వెంటనే ఆర్థిక శాఖ మరియు సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సి. రాజేష్, సి. మధు, బి. అశోక్, రత్న కుమార్, వలి, శివ, నాగమణి, సులోచన, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top