
సత్యం వార్త / నంద్యాల రిపోర్టర్ /జనవరి 6 :
నంద్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10:30కు కలెక్టర్ ఆఫీస్ ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు, రేనాటి యుద్ధ వీరుడు వడ్డె ఓబన్న గారి జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మంగళవారం నాడు నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ పిసి వెంకటసుబ్బయ్య, వడ్డే జనార్ధన్, మంజుల సుబ్బరాయుడు, వడ్డే శీను, వడ్డే చక్రధర్, సంపంగి జయకృష్ణ, శిల్పి సుబ్బరాయుడు, నాగేంద్ర సంపంగి శీను, శంకర్ ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరిగింది
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలితరం యోధుడు వడ్డె ఓబన్న అని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యాధిపతిగా ఆయన చూపిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
