యూరియా డీలర్లకు సమానంగా పంపిణీ చేయాలి

సత్యం వార్త / నంద్యాల రిపోర్టర్ /జనవరి 6 : నంద్యాల పట్టణంలో హోల్సేల్ డీలర్లు,రిటైల్ డీలర్లకు యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి, నంద్యాల వారు నున్నా వెంకటేశ్వర్లు ఆధ్వర్యములో నంద్యాల జిల్లా లోని హోల్ సేల్ డీలర్లకు , ఎరువుల కంపెనీల సేల్స్ మేనేజర్ లకు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఎరువుల కంపెనీలు ఎరువులను అలాట్మెంట్ చేసేటప్పుడు ప్రతి హోల్ సేల్ డీలర్లను మరియు కంపెనీ నుండి ఫామ్ ఓ వున్న డీలర్లకు అందరికీ సమానంగా అలాట్ చేయాలని కంపెనీ సేల్స్ మేనేజర్ లకు తెలియజేయడం జరిగినది.అలాగే హోల్ సేల్ డీలర్లు రిటైల్ డీలర్లకు ఎరువులు ఇచ్చేటప్పుడు ఇతర ఎరువులను కచ్చితంగా తీసుకోవాలని కానీ, అధిక ధరలకు ఇవ్వడం కానీ చేస్తే వారిపై FCO 1985 ప్రకారము చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.తరువాత ఎరువుల వాగన్ వచ్చేటప్పుడు 2-3 రోజుల ముందుగానే ముందస్తు ఎరువుల పంపిణీ ప్రణాళిక ని సమర్పించాలని, ఎరువుల వాగన్ వచ్చిన వెంటనే సమాచారము ఇవ్వాలని, ఎరువుల వాస్తవ పంపిణీ రిపోర్ట్ వాగన్ వచ్చిన 1-2 రోజులలో సమర్పించాలని తెలియజేయడం జరిగినది. జనవరి నెలకు అవసరమైన యూరియాను కంపెని ప్రతినిధులు వారి కేటాయింపులకు అనుగుణంగా జిల్లాకు త్వరతగతిన తెప్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అదేవిధంగా జిల్లాలోని డీలర్లు అందరూ యూరియా నిల్వలు రోజు ప్రభుత్వం వారిచే రూపొందించిన బోర్డు నందు అప్డేట్ చేసి రైతులకు MRP ధర కంటే విక్రయించారాదని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమములో జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు సుధాకర్ , గిరీష్ , విజయ శేఖర్ , వ్యవసాయ అధికారులు ప్రసాద రావు కళ్యాణ్ కుమార్ హోల్ సేల్ డీలర్లు, కంపెనీల సేల్స్ ఆఫీసర్స్ లు పాల్గొన్నారు.

Scroll to Top