




సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా 9వ వార్డు పరిధిలోని గుడిపాటి గడ్డలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సోమవారం భూమి పూజ నిర్వహించారు.
9 వార్డ్ టీడీపీ ఇంచార్జి చెన్నం శెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. పట్టణంలోని ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలను గుర్తించి వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న 9 వార్డ్ టీడీపీ ఇంచార్జి చెన్నం శెట్టి శ్రీనివాసులును ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ అభినందించారు.
వార్డు ఇంచార్జి చెన్నం శెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక ప్రజల విన్నపం మేరకు మంత్రి ఫరూక్ సహకారంతో ఈ సీసీ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందని, వార్డులో ఇంకా పెండింగ్‌లో ఉన్న సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామిని మల్లికార్జున, బోయ రామకృష్ణ, ఉప్పరి సురేష్, మిడత వెంకటేశ్వర్లు, సింహాద్రి సురేష్ బాబు, పెద్ది మురళి, పి వై రామాంజనేయులు, మచ్చ సురేష్, మహబూబ్, పత్తి సుబ్బయ్య, సంఘ బ్రహ్మం, గొల్ల శంకర్, సద్దాం హుస్సేన్, మాజీ కౌన్సిలర్ దేవరపాటి రవికుమార్, చలం బాబు, ఎల్లత్తల శ్రీనివాసులు, సంఘ రమణ, సంఘ జయంతి, తులసి, నీరజ, ప్రవళిక, నసీమా స్థానిక నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
