పిజిఆర్ఎస్ ద్వారా 263 దరఖాస్తుల స్వీకరణ
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 141 దరఖాస్తుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఏప్రిల్ 06 :
ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తోగట ప్రియాంక, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తోందని అందుకు అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధతో అర్జీలను పరిష్కరించాలన్నారు. రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చే వినతులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటికి తొలి ప్రాధాన్యంతో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా 263 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.
రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 141 అర్జీల స్వీకరణ:
భూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తంగా 141 దరఖాస్తులు స్వీకరించగా వాటిలో రెవెన్యూ, గ్రామ/వార్డు సచివాలయ సేవలకు సంబంధించినవి 4, అడంగల్ సవరణలకు సంబంధించినవి 11, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22-ఎ భూములకు సంబంధించినవి 17, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 12, రెవెన్యూ కోర్టు విచారణలు/ఆర్ఓఆర్కు సంబంధించినవి 28, సర్వే, రీ-సర్వేలకు సంబంధించినవి 63, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించినవి 6గా ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
