

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 09 :
నంద్యాల నియోజకవర్గ సమస్యలపై వినతి – సానుకూలంగా స్పందించిన సీఎం..రోడ్లు,తాగునీరు,డ్రైనేజ్ అంశాలు ప్రస్తావన..అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి..సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సీఎం.
నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి సోమవారం డోన్‌కు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రజా సమస్యలు,అభివృద్ధి అవసరాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసి వివరించినట్లు సమాచారం. నియోజకవర్గంలో రోడ్లు,తాగునీటి సమస్యలు,డ్రైనేజ్ వ్యవస్థ,గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు సంబంధించిన పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కూడా కోరినట్లు సమాచారం. భూమా బ్రహ్మానంద రెడ్డి వినతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధగా విని,సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. నంద్యాల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని,ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
