
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 09 :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సంఘం ఆధ్వర్యంలో సోమవారం నంద్యాలలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం మాట్లాడుతూ మహిళలు కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా బలమైన ఆధారం అని తెలిపారు. విద్య, అవగాహనతో మహిళలు ముందుకు వచ్చి సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఎస్డిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అడ్వకేట్ నయీమున్ని మాట్లాడుతూ మహిళలకు విద్య, స్వాభిమానం, హక్కులపై అవగాహన అవసరమని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం, భద్రత కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
ఎస్డిపిఐ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాస్ మాట్లాడుతూ తల్లి పిల్లలకు మొదటి గురువు అని, ఆమె నేర్పే విలువలతో మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఫాజిల్ దేశాయ్, మహిళా సంఘం జిల్లా ఇంచార్జ్ జరీనతో పాటు మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
