దేశంలో ఉన్నత పదవుల్లో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు
మహిళలను గౌరవించే చోట ,దేవతలు కొలువై ఉంటారు
శానిటేషన్ మహిళా సిబ్బంది కి సన్మానం



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 12:
దేశంలో ఉన్నత పదవుల్లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని,మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని,మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని మున్సిపల్ చైర్మెన్ మాబున్నిసా పేర్కొన్నారు.నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ మాబున్నిసా,కమిషనర్ బండి శేషన్న,వైస్ చైర్మన్ పామ్ షా వలి,కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ నాడు మహిళలకు సముచిత స్థానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో శానిటేషన్ మహిళా సిబ్బందికి సన్మానం చేశారు.ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు.మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారన్నారు.కుటుంబాన్ని చక్కదిద్దుకొని,పిల్లలు,భర్త కు అన్ని సౌకర్యాలు కల్పించి పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరి నీ పేరు,పేరున అభినందిస్తున్నానని అన్నారు.ప్రతి రంగంలో మహిళలు ఒక శక్తిగా రాణించడం గర్వించదగ్గ విషయం అన్నారు.మహిళలు ఓర్పు,సహనం తో ముందుకు సాగాలన్నారు.సమాజంలో గౌరవాన్ని తగ్గించుకోకుండా మనపై మనం విశ్వాసం పెంచుకోవాలన్నారు.కుటుంబంలో బార్యా,భర్తలు జోడెడ్డుల లాంటి వారని పిల్లలకు చిన్న తనం నుంచి సమాజంలో జరుగుతున్న విషయాలు తెలియజేస్తే భవిషత్తు ఉన్నతంగా మలుచుకోవచ్చన్నారు.మహిళలు అనుకుంటే సాధించలేనిది ఇది లేదని ,ప్రతి రంగంలో ముందుకు సాగిపోవాలన్నారు.
మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8 న జరిగిందన్నారు.మహిళలకు సముచితస్తానం ఇవ్వాలని శానిటేషన్ మహిళా సిబ్బందికి సన్మానం చేయాలని నిచ్చయించుకొని ఈ రోజు సన్మానం చేస్తున్నామన్నారు.మహిళలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని,మహోన్నత సేవలకు సత్కరించాలి,గౌరవించాలన్నారు.మహిళలు ఉంటేనే,పురుషులు ఉంటారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.రాజకీయంగా ప్రభుత్వాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిందన్నారు.రాజకీయాల్లో సైతం మహిళలు రాణిస్తున్నారన్నారు.చైర్మెన్ మాబున్నిసా చక్కటి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నారీ లీగ్ లో భాగంగా చైర్మెన్ కు సన్మానం చేయబోతున్నామని ప్రకటించి చేయకపోవడం విశేషం.దేశంలో ప్రథమ పౌరురాలు,ఆర్థిక మంత్రి,హోం మంత్రి,జిల్లా కలెక్టర్,మున్సిపల్ చైర్మెన్ అందరూ మహిళలే అని గుర్తుచేశారు.రాష్ట్రంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి మాత్రమే వారికి ఇచ్చే దుస్తులు, సబ్బులు,చెప్పులు, గ్లౌజు లు,కొబ్బరి నూనెలు అందిస్తారని,అప్ కాస్ సిబ్బందికి ఎక్కడా ఈ వస్తువులు ఇవ్వరని నంద్యాల లో మాత్రం చైర్మెన్,వైస్ చైర్మన్లు,కౌన్సిలర్స్ అందరూ మన వద్ద పనిచేసే సిబ్బందికి అందరితో సమానంగా ఇవ్వాలని బడ్జెట్ రూపొందించి అన్ని వస్తువులు ఇవ్వడం రాష్ట్రంలో ప్రథమం అన్నారు.మనకోసం పాటుపడుతున్న వారందరికీ ఇస్తూ నలుగురు మహిళలకు సన్మానం చేశారు.స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ప్రొటెక్షన్ గ్రూపుకు చేరుకున్న ఘనత మీ కష్టంతోనే సాధ్యమైందని సిబ్బందిని,అధికారులను అభినందించారు.ఏప్రిల్ 1 నుంచి ప్రత్యేక టీం వస్తుందని నంద్యాలలో టాయిలెట్స్,కాల్వలు,పార్కులు,ప్లే గ్రౌండ్స్,వీధులు,డంపింగ్ యార్డ్ శుభ్రంగా పెట్టేందుకు వస్తున్న ఈ టీం కు అందరూ సహకరించాలన్నారు.నంద్యాలలో ప్రతి ఒక్కరు కష్టపడితే భారతదేశంలో కీర్తించే స్థాయికి వస్తున్నారు.మహిళలు అందరికీ వందనాలు తెలిపారు. అనంతరం ఆప్ కాస్ సిబ్బందికి సబ్బులు,నూనె బాటిల్స్ అందించారు. ఈ కార్యక్రమంలోశానిటేషన్ అధికారులు మురళీధర్,లక్ష్మీనారాయణ,శివప్రసాద్ రెడ్డి,కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.
