కాలువలు లేక సాగునీరు దూరం – సాగునీటి సాధన సమితి విమర్శ

సత్యం వార్త / నంద్యాల  / మార్చి 12 :
కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ పంట కాలువల నిర్మాణం పూర్తికాక రాయలసీమలో లక్షల ఎకరాలు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి విమర్శించింది. పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ “తెలుసుకో నాయకా… ఏది ముందో ఎరగరా?” అనే సందేశాత్మక ఆడియో గీతాన్ని గురువారం నంద్యాలలో విడుదల చేశారు.
సమితి నాయకులు మాట్లాడుతూ, ప్రాజెక్టులు పూర్తయ్యాయని ప్రచారం చేస్తున్నప్పటికీ కాలువలు లేక రైతుల పొలాలకు నీరు చేరడం లేదన్నారు. పంట కాలువలు నిర్మిస్తే వచ్చే ఏడాదికే సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పెండింగ్‌లో ఉన్న కాలువల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, యర్రం శంకర్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top