అక్రమ రవాణా ,అసాంఘిక కార్యకలాపాల కట్టడికి తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించిన రెండవ పట్టణ ఇన్స్పెక్టర్



సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 24:
నంద్యాల జిల్లా వ్యాప్తంగా నిషేధిత వస్తువులు అక్రమ రవాణా జరగకుండా మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడంలో భాగంగా ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు నంద్యాల రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ అశ్రర్ భాషా వారి సిబ్బంది సహాయంతో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు మోటార్ సైకిల్ లను, కార్లు మరియు ఆటోలను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేసిన లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
