న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాలతో


సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 24 :
నంద్యాల పట్టణం 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ టైలర్స్ కాలనీలో సరైన రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు లేక ఉన్నవి వెలగక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. విషయం తెలుసుకున్న 38వ వార్డు టిడిపి ఇన్చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వారి కుమారులు ఎన్ ఎం డి ఫిరోజ్ ఎన్ఎండి ఫయాజ్ ఆదేశాలతో టైలర్స్ కాలనీని సందర్శించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి తెలుసుకుని వెంటనే జెసిబి తెప్పించి రోడ్డు మరమ్మత్తులు చేయించారు. అలాగే స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో సంబంధిత అధికారులకు విషయం తెలిపి అధికారులు వచ్చే వరకు అక్కడే ఉండి స్ట్రీట్ లైట్ మరమ్మత్తులు చేపించారు. అలాగే కాలనీలో ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని కాలనీవాసులను కోరారు. ఈ సందర్భంగా టైలర్స్ కాలనీవాసులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా మేము పడుతున్న ఇబ్బందులను గమనించిన వార్డు ఇన్చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు స్వయంగా కాలనీలో రోడ్డు మరమ్మత్తు పనులు స్ట్రీట్ లైట్స్ మరమ్మత్తు పనులు చేపించడంతో సంతోషం వ్యక్తం చేసి తాటికొండ బుగ్గ రాముడి కు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు వడ్డే నాగేంద్ర,హిమామ్ హుస్సేన్, కాలనీవాసులు శిరీష తదితరులు పాల్గొన్నారు.
