సెవెన్ హిల్స్ ఆస్పత్రి 10 ఏళ్లు పూర్తి

సత్యం వార్త / నంద్యాల / మార్చి 23 :

సెవెన్ హిల్స్ హాస్పిటల్ స్థాపనకు 10 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఎండి రెంటాల మారుతి కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను ప్రారంభించారు. ఇప్పటివరకు 5 వేలకుపైగా ట్రామా కేసులు, 300కు పైగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఎండి తెలిపారు. పట్టణ ప్రజలు అందించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సందీప్, మేనేజింగ్ పార్టనర్ డాక్టర్ దస్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు. ఓటీ సిబ్బందిని ఈ సందర్భంగా సన్మానించారు. ఆరోగ్యశ్రీ, ఇన్సూరెన్స్ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ సందీప్ సూచించారు.

Scroll to Top