ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న వన్ టౌన్ పోలీస్ టీమ్
వన్ టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు


సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / మార్చి 23 :
నంద్యాల జిల్లా లో 22.03.26 వ తేదీన సాయంత్రము షేక్ శాలినా మరియు ఆమె భర్త పిల్లలు కలిసి బైక్ మీద చాబోలు నుండి నంద్యాల 1 టౌన్ పరిధి లో ని నడిగడ్డ లోని ఆమె చెల్లెలు ఇంటికి బట్టలు మరియు 12 తులాల బంగారాన్ని బ్యాగ్ లో పెట్టుకుని వస్తుండగా 1 టౌన్ పరిధిలోకి వచ్చేసరికి బంగారు ఉన్న బ్యాగ్ పడిపోయింది. సదరు విషయాన్ని గమనించిన ఫిర్యాదిదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన అనంతరం ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తన సిబ్బంది సహాయంతో నంద్యాల టౌన్ పరిధిలో బాధితులు వెళ్లిన ప్రదేశంలోని వివిధ సీసీ కెమెరాలను మరియు పట్టణ కేంద్రంలో ఉన్న కమాండ్ కంట్రోల్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి సదరు బాగ్ నడిగడ్డకి చెందిన ఆటో డ్రైవర్ అయిన ఎస్.కె. నూరుల్లా భాషా కి దొరికిన సమాచారము తెలుసుకుని అతన్ని పిలిపించి విచారించగా పోయిన బ్యాగ్ ని తీసుకుని ఇవ్వడం జరిగింది. సదరు బ్యాగ్ ని ఫిర్యాదు సమక్షములో పరిశీలించగా అందులో బంగారు నగలు అన్నీ ఉన్నాయని గుర్తించారు. తరువాత 12 తులాల నగలను బట్టలను ఫిర్యాదుదారులుకు అప్పగించడమయినది. కేవలం గంటల వ్యవధిలో ఇన్స్పెక్టర్ తన సిబ్బందిని అప్రమత్తం చేసి పోగొట్టుకున్న బ్యాగును కనిపెట్టి బాధితులకు ఇవ్వడంతో వారు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి కి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
