సీఎంతో అభివృద్ధి అంశాలపై అభిరుచి మధు చర్చ

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 11 :
నంద్యాల జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అభిరుచి మధు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి చర్చించారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, తాగునీటి సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, నంద్యాల ప్రజలకు ఉపయోగపడే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రిని అభిరుచి మధు కోరారు. నంద్యాల ప్రాంత అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు అభిరుచి మధు తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా నంద్యాల జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సానుకూల చర్చ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

Scroll to Top