నాలుగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు
పంటపొలాలు నాశనం అవుతున్నాయని రైతుల ఆవేదన
నాలుగు చిమ్నీ ల నుంచి వెదజల్లుతున్న పొగ
ప్రజలు అనా రోగాల భారిన పడకుండా చూడాలంటున్న ప్రజలు

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 11 :
నంద్యాల పట్టణ శివారులోని ఓ సీడ్ ఫ్యాక్టరీ చిమ్నీ ల నుంచి వెలువడుతున్న పొగతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఆ ఫ్యాక్టరీలో నాలుగు చిన్నుల నుంచి వచ్చే పొగ,బూడిద వల్ల చుట్టూ పక్కల ఉన్న పంటపొలాలపై పడటంతో పేరుకుపోతుంది అని రైతులు వాపోతున్నారు.
పొలాలపై పడటంవల్ల కిరణజన్య సంయోగక్రియ దెబ్బతిని పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుందని ఆవేదన చెందుతున్నారు.వివరాల్లోకి వెళితే నంద్యాల నుంచి ఆళ్లగడ్డ కు వెళ్ళే హైవే లో ఈ సీడ్ ఫ్యాక్టరీ ఉంది.సీ డ్ ఫ్యాక్టరీలు నాలుగు చిమ్నీలు నుంచి దట్టమైన పొగ వెదజల్లుతుంది.నిరంతరాయంగా పొగ రావడం ఒక వైపు నేషనల్ హైవే కావడంతో వాహనాలు అధికసంఖ్యలో వెళుతుంటాయి. కర్నూలు,కడప రాయలసీమ ఎక్స్ప్రెస్ కావడంతో నిరంతరం వాహనాలు వెళుతుంటాయి.గలవిచినప్పుడు ఆ పొగతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.ఫ్యాక్టరీ చిమ్నీలనుంచి వెలువడే నల్లటి పొగ చుట్టుప్రక్కల గ్రామాలపై ప్రభావం చూపుతుంది.గాలిని కలుషితం చేయడమే కాకుండా,పరిసరాల్లో పంటపొలాలపై బూడిద పేరుకుపోతుంది అని రైతులు ఆరోపిస్తున్నారు.ప్రధానంగా చాబోలు, సాంబ వరం,మసీదు పురం,అయ్యలూరు ప్రాంతాల్లో నీ సరిహద్దుల్లో పంటలు,ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వల్ల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ,కళ్ళ మంటలు,అలర్జీ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు.ప్రధానంగా చిన్న పిల్లలు,వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం సరైన ఫిల్టర్లు,కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.పగలు,రాత్రి తేడా లేకుండా ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వల్ల ఇళ్లలో ఉండలేకపోతున్నామని,ఇంటి ముందు బట్టలు ఆరవేసినా,గిన్నెలపైన నల్లటి పొగ పేరుకుపోతుంది అని ఆరోపిస్తున్నారు.ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఫ్యాక్టరీ ముందు పలుమార్లు నిరసన చేసినా పలితం లేకపోవడానికి కారణం ఆ ఫ్యాక్టరీ యజమాని మాజీ ప్రజాప్రతినిధి కావడమే కారణం అని తెలుస్తోంది.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నంద్యాల జిల్లా అయినా కర్నూల్ లోనే అధికారులు ఉండడంతో సమస్యలు చెప్పాలన్న కష్టంగా మారింది.కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రైతులు,ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీని సందర్శించి కాలుష్య స్థాయిని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పొగను నియంత్రించే అత్యాధునిక ఎలక్ట్రోస్టేటిక్ ప్రేసిపీటైటర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేధావులు పేర్కొంటున్నారు.మరో వైపు నేషనల్ హైవే కావడంతో చుట్టూ పక్కల వెంచర్లు,పొలాలకు గిరాకీ ఉంటుందని భావించిన వారికి ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ,ధూళి వల్ల కొనుగోలు లేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు సైతం వేసిన పంటలు పై బూడిద పేరుకొని పోవడంతో పంట దిగుబడులు తగ్గి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే రైతులు,ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
