సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 15 :
పేద ప్రజలు ఆపదలో ఉంటే ‘నేనున్నాను’ అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు 29 మంది లబ్ధిదారులకు 33 లక్షల 57 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది 

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎక్కువ ఆక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం, ,వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు నాకు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారన్నారు. అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 29 మందికి వచ్చిన 33 లక్షల 57 వేల రూపాయలను చెక్కుల రూపంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

 ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాజ్ , నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కామిని మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top