సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 24:
నంద్యాల నియోజకవర్గంలో మంత్రి ఫరూక్ తనయుడు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ఆపద సమయాల్లో అందించే మెడికల్ రీయబర్స్మెంట్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు ఈరోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు 36 మంది లబ్ధిదారులకు 23 లక్షల 25 వేల 962 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా 23 లక్షల రూపాయలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలిపారు . కూటమి ప్రభుత్వం అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయ నిధిని అందిస్తున్నట్లు తెలిపారు . నంద్యాల టౌన్ , నంద్యాల మండలం మరియు గోస్పాడు మండల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు . ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రులు నారా లోకేష్ , ఎన్ఎండి ఫరూక్ లతో పాటు ఫిరోజ్ , ఫయాజ్ లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , గోస్పాడు మండల టిడిపి కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , కౌన్సిలర్ నాగార్జున, బీసీ సాధికార సమితి కన్వీనర్ గోవింద్ నాయుడు, ఉప్పర కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పర సురేష్ కుమార్ , షేక్ మున్న మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top