
సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
నంద్యాల టౌన్ 38వ వార్డు నందమూరి నగర్ నందు ఉన్న కోదండ రామాలయం నందు శ్రీ రామనవమి పండుగ సందర్భంగా నిర్వహించే శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవానికి వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు ని ఆలయ కమిటీ సభ్యులు సగౌరవంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బుగ్గరాముడు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానిస్తున్న కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తనవంతగా ఆరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి 5016/-వేళా రూపాయలు విరాళం కమిటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మరియు నందమూరి నగర్ కోదండ రామాలయం కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
