వైసీపీ నేతల సేవా కార్యక్రమం..పేదల ముఖాల్లో ఆనందం పూయించిన నాగిని రవి సింగారెడ్డి



సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 17 :
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నంద్యాలలో సేవా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వైసీపీ ఉపాధ్యక్షుడు డా.దాల్మిల్ అమీర్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి శిల్పా చారిటీస్ చైర్మన్ నాగిని రవి సింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా 3,000 పేద కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు, పండుగకు అవసరమైన సామగ్రి ఇవ్వడంతో పేదల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ అనేది కేవలం ఆచారం మాత్రమే కాకుండా సేవా భావానికి ప్రతీక అని అన్నారు. పేదలతో పండుగ ఆనందాన్ని పంచుకోవడం తమ ధ్యేయమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
డా.దాల్మిల్ అమీర్ మాట్లాడుతూ పేదల సంక్షేమం వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి సంవత్సరం మరింత విస్తృతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమాజంలో ఐక్యత,సహకారం పెంపొందించడంలో ఈ కార్యక్రమాలు కీలకమని అన్నారు.
పంపిణీ కార్యక్రమం సందర్భంగా ప్రజలు భారీగా హాజరై నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకుల సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ “ఇదే నిజమైన పండుగ స్ఫూర్తి”అంటూ అభినందనలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు,కార్యకర్తలు,శిల్పా చారిటీస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
