శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల లో “ కెమరూన్-2K26 కార్యక్రమం

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 07 :

శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (అటానమస్), నంద్యాలలో శనివారం నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆధ్వర్యంలో “ కెమరూన్-2K26 ” అని పేరుతో ఒక  జాతీయస్థాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీట్ ను అధ్యాపకులు మరియు విద్యార్థులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మూడవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ , రాజంపేట ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.  శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి, సెక్రెటరీ విజయ కుమారి,  కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్స్ ప్రగతి రెడ్డి , ప్రిన్సిపల్ కె.బి.వి. సుబ్బయ్య,  లింగయ్య  (న్యాయవాది), కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్స్ విభాగాధిపతి, డాక్టర్ యు. వి. యస్. కుమార్, కన్వీనర్ వెంకట్రావు, ఇతర అధ్యాపకులు మరియు బిసిఏ విద్యార్థులు అలాగే ఇతర కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు అధ్యాపకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా స్వాగత నృత్యం మరియు ప్రార్థన గీతంతో మొదలుపెట్టారు.

రామక్రిష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మూడవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ , రాజంపేట ఎస్. ప్రవీణ్ కుమార్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు మా బి. కామ్. ప్రొఫెషనల్ కోర్సు యొక్క పూర్వ విద్యార్థి కావడం మరియు చాలా కాలం తరువాత, జిల్లా జడ్జ్ రూపంలో తిరిగి మీరు చదువుకున్న కళాశాల యందు జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రావడం, మాకు చాలా ఆనందంగా మరియు గర్వకారణంగా ఉంది. విద్యార్థులందరికీ మీ ప్రతిభను కనబరుచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం, మీరు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని మరియు మీ ఆలోచనలను చూపించండి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు అని తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి ఈ ఐటీ (ఐటీ)ఫెస్ట్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రదేశాల నుండి విద్యార్థులు హాజరయ్యారు వారికి తెలియని ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటారు. గెలుపు ఓటమికంటే ప్రతిదాంట్లో పాల్గొనడం ముఖ్యము దీని ద్వారా వారు వారికి తెలియని ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారు ఎక్కడ తప్పు చేశారు అనేది సరిదిద్దుకొని ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటారు అని తెలియజేశారు. ఏ రంగం తీసుకున్న కృత్రిమ మేధస్సు పెరిగిపోయింది. దానికి అనుగుణంగా మనం అభివృద్ధి చెందగలిగితే ఇప్పుడున్న సమాజంలో ముందుకు వెళ్దాం అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఎస్ ప్రవీణ్ ని ఆదర్శంగా తీసుకొని వారి జీవితాన్ని కూడా ఎంతో విజయవంతంగా సాగించాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇతర కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు నా ఆల్ ది బెస్ట్ , మీరు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.

కళాశాల ప్రిన్సిపల్ కే.బీ.వీ. సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఈ ఐటీ(ఐటీ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు మంచి నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఒక మంచి వేదిక అవుతుంది. ఈ కళాశాల స్థాపించిన రామకృష్ణారెడ్డి మరియు అతని కుటుంబంలోని వారందరూ ఎక్కువగా విద్యకే ప్రాధాన్యం ఇస్తారు.. అలాగే ఇటువంటి కార్యక్రమాలు కళాశాల యాజమాన్యం  నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.. ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి తున్న టెక్నాలజీ మరియు నైపుణ్యాల గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ప్రతిభను చూపించుకోని మీ ఆలోచనలను మెరుగుపరచుకోవడానికి మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

కళాశాల డీన్ ఆఫ్ అకాడమిక్స్ A.S. ప్రగతి మాట్లాడుతూ BCA అనేది సాంకేతికకు సంబంధించినది. మొదట్లో మొబైల్ ఫోన్ వాడేవారు తర్వాత కృత్రిమ మేధస్సు వాడారు మరి ఇప్పుడు క్లౌడింగ్ ని ఉపయోగిస్తున్నారు. ఇలా కాలానికి అనుగుణంగా మనం మన నైపుణ్యాలను పెంచుకుంటే ఎంతో మందికి సహాయం చేసిన వారం అవుతాము. ప్రతిరోజు ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటే అది మనలోని ఆవిష్కరణలను బయటకు తీస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి విచ్చేసినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.

కన్వీనర్ వెంకట్రావు మాట్లాడుతూ ముందుగా ఇక్కడికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ విచ్చేసిన ముఖ్యఅతిథికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విద్యార్థులు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభినందనలు… విద్యార్థులందరికీ ఇది ఒక మంచి అవకాశం మీరు మీ ప్రతిభను మరియు మీ ఆలోచన చూపించుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది.. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

డా. యు. ఎస్. కుమార్ మాట్లాడుతూ మాకు చాలా గర్వంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. ఈ కార్యక్రమంలో మీలో ఉన్న నైపుణ్యాలను తెలివిని బయటకు తీయవచ్చు వాటి ద్వారా ఎన్నో రూపకల్పనలు చేయవచ్చు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకి ఉన్న నైపుణ్యాలను పెంపొందించాలి. పుస్తకాలు పాఠశాలలే కాకుండా బయట ఉన్న సమాజంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన కలిగి ఉండాలి. పోటీ ఏదైనా గెలిచామా ఊడేమా అనే దానికంటే దానిలో మనం పాల్గొని ఎంత నేర్చుకున్నాము అనేది ముఖ్యం అని తెలియజేశారు.

ప్రముఖ న్యాయవాది శ్రీ లింగయ్య మాట్లాడుతూ నేను ఈ కళాశాల ఒకప్పటి పూర్వ విద్యార్థిని. నేను ప్రవీణ్ కుమార్ గారితో కలిసి చాలా కార్యక్రమాలలో ఉండటం ఎంతో గర్వంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసి ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొని అంతే సంతోషంగా తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మూడవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ , రాజంపేట ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ ప్రాంతానికి చెందిన వాడిని నన్ను స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీరు కూడా మారి మీ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని కోరుకుంటున్నాను. నేను ఒకప్పటి విద్యార్థినే నీలాగే కూర్చున్నాను కానీ ఇప్పుడు ఇదే కళాశాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి మా గురువుల పక్కన కూర్చుని స్థాయికి ఎదిగాను మీరు కూడా అలా ఎదగాలి అని తెలియజేశారు. న్యాయవాది అనేవారు ప్రభుత్వం చేతుల్లో ఉండరు వారు సమాజానికి సేవ చేయడానికి మాత్రమే ఉన్నారు. ఏ నిర్ణయమైనా వారు తీసుకుంటేనే అమల్లోకి వస్తుంది అని తెలియజేశారు. మన వ్యవస్థ అనేది మూడు స్తంభాల మీద నడుస్తుంది మొదటగా చట్టాలను అమలు చేసేవారు, రెండవదిగా చట్టాలను రూపొందించేవారు మూడవదిగా న్యాయాన్ని అందించేవారు మరియు సమాజాన్ని రక్షించేవారు. ఇప్పుడున్న కలానికి అనుగుణంగా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటే మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి బయట పరిస్థితులను అలాగే విద్య పరిస్థితిలో ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాము అనేది గ్రహించాలి అని తెలియజేశారు. మన నంద్యాల జిల్లాలో ఒక న్యాయవాదికి సంబంధించిన కళాశాల నిర్మించాలని కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి .రామకృష్ణారెడ్డి ని అడిగారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన కళాశాల విద్యార్థులు మరియు కన్వీనర్స్ అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కి అభినందనలు తెలుపుతున్నాను.. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులందరికీ ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను గెలుపు ఓటములు అనేది తరువాత విషయం మీరు మీ ప్రతిభను మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశ్యము అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీలు అయినా కోడ్ క్వెస్ట్, టెక్నికల్ క్విజ్, పేపర్ ప్రెజెంటేషన్, కల్చరల్ యాక్టివిటీస్ గురించి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలియజేసి ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులకు అభినందనలు తెలియజేసి పోటీలను ప్రారంభించారు.

Scroll to Top