శర వేగంగా స్మశాన వాటిక పనులను పరిశీలిస్తున్న టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు

స్థానిక మంత్రి వర్యులు ఎన్ఎండి.ఫరూక్ వారి కుమారులు ఎన్ఎండి.ఫిరోజ్, ఎన్ఎండి.ఫయాజ్ ఆధ్వర్యంలో

దగ్గర ఉండి పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, గుర్రప్ప, వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు..

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 18 :
నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ నందు గత కొన్ని సంవత్సరాలుగా స్మశాన వాటిక లేక హిందువులు,ముస్లింలు, క్రైస్తవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు విషయాన్ని స్థానిక వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు మంత్రి వర్యులు ఫరూక్, వారి కుమారులు ఫిరోజ్,ఫయాజ్ దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారం వచ్చిన దాదాపు రెండు సంవత్సరాల్లోనే స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ప్రత్యక నిధులు కేటాయించి ఈరోజు పని ప్రారంభిండం జరిగింది ఈ పనిని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, యంఈ గుర్రప్ప, వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు దగ్గర ఉండి పనులను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top