సమయపాలన లేక రిజిస్ట్రేషన్ దారుల ఆగ్రహం

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 19 :
జిల్లా ప్రధాన కేంద్రం అయిన నంద్యాలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమయపాలన లోపం,నిర్వాహక లోపాలపై రిజిస్ట్రేషన్ దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు కార్యాలయానికి నిర్దిష్ట సమయానికి హాజరుకావడం లేదని,మధ్యలోనే విధులను వదిలి వెళ్లిపోతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..ప్రతిరోజూ రిజిస్ట్రేషన్ పనుల కోసం దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గంటల తరబడి కార్యాలయం ముందు వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు..!! ..“ఎప్పుడు వస్తారు..?? ఎప్పుడు వెళ్తారు..?? ఏ సమయానికి పని చేస్తారు?”అన్న అనిశ్చిత పరిస్థితి నెలకొన్నదని బాధితులు చెబుతున్నారు…జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఉన్న కీలక కార్యాలయంలో ఇలాంటి పరిస్థితి ఉండడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..!!..“ప్రతి రిజిస్ట్రేషన్‌కు వేరే లెక్కలు చెబుతున్నారు,కానీ పని మాత్రం వేగంగా జరగడం లేదు” అంటూ కొందరు రిజిస్ట్రేషన్ దారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు..!!..కార్యాలయ సిబ్బంది కూడా స్పష్టమైన సమయ నియంత్రణ లేక ఇబ్బందులు పడుతున్నారని సమాచారం..!!..రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా కొనుగోలు,అమ్మకాలు,బ్యాంకు లోన్లు తదితర ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..!! ..ఇలాంటి కీలక స్థానం అయిన జిల్లా ప్రధాన కేంద్రంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారిపై పర్యవేక్షణ లేదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..!!..సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పరిస్థితిని పరిశీలించాలని,కార్యాలయంలో సమయపాలన కచ్చితంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు..!!..ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా..??రిజిస్ట్రేషన్ దారుల గోసకు పరిష్కారం దొరుకుతుందా..?? వేచి చూడాలి మరి.
