- నెల రోజుల పాటు ఎముకలు,కీళ్ళ ఉచిత ఓ.పి. వైద్య సేవలు ప్రారంభం
- ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ
- రంజాన్ మాసం పురస్కరించుకుని ప్రముఖ ఎముకలు,కీళ్ల నిపుణులు డాక్టర్ మహమ్మద్ రఫీ వైద్య సేవలు అందిస్తారు
- ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి: డాక్టర్ మహమ్మద్ రఫీ.

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 19 :
ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని గురువారం నుండి వచ్చే నెల రంజాన్ పండుగ వరకు నెల రోజుల పాటు స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న జి.ఎస్.ఆర్. ఆసుపత్రిలో ప్రముఖ ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ మహమ్మద్ రఫీ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఉచిత ఓపి వైద్య సేవల కార్యక్రమం ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస రావు, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ప్రముఖ మానసిక వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఆరీఫా బాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ శ్రీనివాస రావు, డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మహమ్మద్ రఫీ ఉచిత ఓపి వైద్య సేవలు నెలరోజులపాటు అందించడం ప్రశంసనీయమన్నారు. ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరారు. నంద్యాల ఐఎంఏ వైద్యులు ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజలకు విద్యార్థులకు,వైద్య అవగాహన సదస్సులు తరచూ నిర్వహిస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు.
